Advertisement

  • ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్‌19 మ‌ర‌ణాల సంఖ్య ప‌ది ల‌క్షలు?

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్‌19 మ‌ర‌ణాల సంఖ్య ప‌ది ల‌క్షలు?

By: chandrasekar Tue, 29 Sept 2020 12:46 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్‌19 మ‌ర‌ణాల సంఖ్య ప‌ది ల‌క్షలు?


ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణాల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న‌ది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ మొద‌లైన క్ష‌ణం నుంచి కోవిడ్ మృతుల డేటాను సంక్షిప్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే జాన్స్ హాప్కిన్స్ వెబ్‌సైట్ ప్ర‌కారం ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల 98 వేల 145 మంది మ‌ర‌ణించారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సంఖ్య ప‌ది ల‌క్ష‌ల మైలురాయిని దాటే అవ‌కాశాలు ఉన్నాయి. 10 నెల‌ల క్రితం తొలిసారి క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో మొద‌టిసారి ఆ వైర‌స్ ఛాయ‌ల‌ను గుర్తించారు. ఆ త‌ర్వాత ఆ వైర‌స్ మ‌హ‌మ్మారిలా మారి ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రించింది.

క‌రోనా మృతుల సంఖ్య‌ను జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ కేవ‌లం అంచ‌నా మాత్రం వేస్తున్న‌ది. వివిధ దేశాలు మృతుల‌కు సంబంధించిన అంశాన్ని విభిన్నంగా రిపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో మ‌ర‌ణాల లెక్కింపు జ‌ర‌గ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ టెస్టింగ్ పెరిగింది. కానీ మృతుల అంశంలో కొంత అస్ప‌ష్ట‌త నెల‌కొన్న‌ది. అమెరికాలో 204,762 మంది, బ్రెజిల్‌లో 141,741 మంది, ఇండియాలో 95,542 మంది మ‌ర‌ణించిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ త‌న వెబ్ పేజీలో చూపిస్తున్న‌ది. ఇక వైర‌స్ సంక్ర‌మించిన దేశాల్లో.. అమెరికాలో 7,116,456 మందికి, ఇండియాలో 6,074,702 మందికి, బ్రెజిల్‌లో 4,732,309 మందికి వైర‌స్ సోకిన‌ట్లు వ‌ర్సిటీ త‌న డేటాబేస్‌లో పేర్కొన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సోకిన వారిలో 7,116,456 మంది ఉన్నారు.

Tags :

Advertisement