Advertisement

  • భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 7745 కు పెరిగింది

భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 7745 కు పెరిగింది

By: chandrasekar Wed, 10 June 2020 4:47 PM

భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 7745 కు పెరిగింది


దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ప్రపంచ దేశాల్ని భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇండియాలో కరోనా రాకుండా భలే అడ్డుకున్నారే అనుకున్న దేశాలన్నీ ఇప్పుడు ఇండియాలో నమోదవుతున్న కరోనా కేసుల్ని చూసి ఎందుకలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 9985 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు.

the number,of deaths,due to corona,in india has,increased ,భారత్ లో, కరోనా కారణంగా, మరణించిన, వారి సంఖ్య, పెరిగింది


తాజా లెక్కల ప్రకారం నిన్న 5991 మంది కోలుకున్నారు. అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 135205కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది. అదే రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత బ్రెజిల్, అమెరికా తర్వాత మూడోస్థానంలో ఉంది. తాజాగా దేశంలో మొత్తం శాంపిల్ టెస్టుల సంఖ్య 50 లక్షలు దాటి 5061332కి చేరింది. గత 24 గంటల్లో 145216 మందికి టెస్టులు చేశారు.

భారత్ లో కరోనా విజృంభణ ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షల డెబ్బై దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది.

Tags :

Advertisement