Advertisement

ఢిల్లీ లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 70,390

By: chandrasekar Fri, 26 June 2020 3:52 PM

ఢిల్లీ లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 70,390


దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కేంద్రంగా మారిన ఢిల్లీ వైరస్‌ కేసుల నమోదులో ముంబైని అదిగమించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 3,947 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో గురువారం నాటికి మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 70,390కి చేరింది. మరోవైపు ఇప్పటి వరకు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 69,528గా ఉన్నది. దీంతో ముంబైను అదిగమించి తొలి స్థానానికి ఢిల్లీ చేరింది. మే 29 నుంచి ఢిల్లీలో ప్రతి రోజు వెయ్యి మందికిపైగా కరోనా సోకుతున్నది. మే 31 నుంచి కరోనా వ్యాప్తి మూడు రెట్ల మేర పెరిగింది.

జూన్‌ తొలి వారం తర్వాత ఢిల్లీలో కరోనా కేసుల నమోదు రేటు 5.25 శాతానికి చేరగా ముంబైలో 3 శాతం కంటే తక్కువగానే ఉన్నది. ఈ నేపథ్యంలో జూలై ఆరంభంలో కరోనా కేసుల సంఖ్యలో ముంబైని ఢిల్లీ దాటవచ్చని అంచనా వేశారు.

అయితే గురువారం నాటికే ముంబైను దాటి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న నగరంగా ఢిల్లీ నిలిచింది. కరోనా వైరస్‌కు మూలమైన చైనాలోని వూహాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్యను జూన్‌ 9న ముంబై దాటగా తాజాగా ఢిల్లీ కూడా దానిని అదిగమించింది.

Tags :
|
|

Advertisement