Advertisement

  • ఐపీఎల్తో డ్రీమ్ 11 సంస్థ పేరును చేర్చి సరికొత్త లోగో

ఐపీఎల్తో డ్రీమ్ 11 సంస్థ పేరును చేర్చి సరికొత్త లోగో

By: chandrasekar Fri, 21 Aug 2020 11:35 AM

ఐపీఎల్తో డ్రీమ్ 11 సంస్థ పేరును చేర్చి సరికొత్త లోగో


ఐపీఎల్ 2020 పాత స్పాన్సర్స్ వివో స్థానంలో ప్రముఖ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 రావడంతో పాత లోగో స్థానంలో కొత్త లోగో వచ్చేసింది. భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీవో కూడా చైనాకు చెందిన సంస్థ అనే కారణంతో వివోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ఐపీఎల్‌ 2020 నిర్వాహకులకు స్పాన్సర్‌ని మార్చక తప్పలేదు.

ఈ క్రమంలో ఐపీఎల్‌తో డ్రీమ్ 11 సంస్థ పేరును చేర్చి సరికొత్త లోగోను రూపొందించి తాజాగా ఆ లోగోను విడుదల చేశారు. ఐపిఎల్ కొత్త లోగో విడుదలైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు డ్రీమ్ 11 కి కంగ్రాట్స్ చెబుతూ ఆ లోగోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ డీల్ కోసం డ్రీమ్ 11 రూ.222 కోట్లు బిడ్ చేసి ఈ స్పాన్సర్‌షిప్‌ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో అన్‌అకాడమి, టాటా సన్స్, బైజూస్ వంటి కార్పొరేట్ దిగ్గజాలతో డ్రీమ్ 11 పోటీపడాల్సి వచ్చింది. ఇదిలావుంటే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ వేదిక యూఏఈకి మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనున్న ఐపీఎల్ 2020 పోటీల కోసం ప్రస్తుతం ఆటగాళ్లు ప్రాక్టీసింగ్ మొదలు పెట్టారు.

Tags :
|

Advertisement