Advertisement

  • మణిపూర్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఎన్డీఏ ప్రభుత్వం

మణిపూర్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఎన్డీఏ ప్రభుత్వం

By: chandrasekar Tue, 11 Aug 2020 09:23 AM

మణిపూర్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఎన్డీఏ ప్రభుత్వం


ఎన్డీఏ ప్రభుత్వం మణిపూర్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఫ్లోర్ టెస్ట్‌లో ఎన్. బీరెన్ సింగ్ ప్రభుత్వం విశ్వాస ఓటును గెలుచుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా 28 ఓట్లు, వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి. 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉండగా కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.

బలప్రదర్శన అనంతరం ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రదర్శన జరిపారు. అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గిన తరువాత మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మేము వాయిస్ ఓటు ద్వారానే విశ్వాస ఓటును గెలుచుకున్నామని, స్పీకర్ ఏమి చేస్తున్నా అది నిబంధనల ప్రకారం ఉంటుందని చెప్పారు.

అంతకుముందు బీరేన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. తమకు మెజారిటీ ఉన్నదని, మాదే విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ తకేంద్ర సింగ్ చెప్పారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. బీజేపీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఎన్‌పీపీ కే 4, ఎన్‌పీఎఫ్ కే 4, ఎల్‌జేపీకి ఒక ఎమ్మెల్యే మద్దతు ఉన్నది. మణిపూర్లో జూన్ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దాంతో గత నెల 28న కాంగ్రెస్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం తీసుకొచ్చారు.

Tags :

Advertisement