Advertisement

  • తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కూతురికి కట్టబెట్టిన తల్లి

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కూతురికి కట్టబెట్టిన తల్లి

By: chandrasekar Tue, 15 Sept 2020 09:20 AM

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కూతురికి కట్టబెట్టిన తల్లి


తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కూతురికి కట్టబెట్టిన తల్లి వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. వివాహేతర బంధాలతో కన్న కూతురి జీవితాన్నే నాశనం చేసింది. కన్నతల్లే తన పడక సుఖం కోసం కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసింది. వివరాల్లోకి వెళితే బీహార్ లోని చాప్రా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక యువతీ తన భర్తతో కలిసి రాంగడ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త వృత్తి రీత్యా, ముంబైకు వలస వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఆమెకి అక్కడే స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసే యువ ఉపాధ్యాయుడుతో పరిచయం ఏర్పడింది.

వీరి మధ్య పరిచయం కాస్త ఎక్కువ కావడంతో ఉపాధ్యాయుడు దూరపు బంధువు అవ్వడం వల్ల యువతిని కలిసేందుకు తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా వివాహేతర బంధంగా మారింది. ఆమె తన కుమార్తెలు ఇద్దరినీ ఏదో ఒక పని చెప్పి బయటకు పంపి గోపాల్ తో ఇంట్లోనే రాసలీలలు చేసేది. అయితే ఆమె పెద్ద కుమార్తె కు తన తల్లి ప్రవర్తన నచ్చలేదు. దీంతో తరచూ ఆమెను నిలదీసేది, దీంతో తన కుమార్తె నోరు మూయించాలని ఆమె ప్లాన్ వేసింది. ఉపాధ్యాయుడు ఇంకా అవివాహితుడు కావడంతో అతడికి తన పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే ఏ ప్రాబ్లం ఉండదనుకుంది. ఉపాధ్యాయుడు కూడా ఇంటికి అల్లుడు అయితే ఇక శాశ్వతంగా తమ పడక సుఖానికి అడ్డు ఉండదని భావించింది. దీంతో కూతురు జీవితాన్నే నాశనం చేయాలనుకుంది.

వయసులో చిన్నదైన మైనారిటీ కూడా తీరని 16 ఏళ్ల పెద్ద కూతురిని తన ప్రియుడుకు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం జరిపించింది. అయితే కూతురి ముందే ఆమె, అల్లుడు ఇద్దరూ బెడ్రూంలో దూరి శృంగారం చేసుకోవడం చూసి కూతురు తట్టుకోలేకపోయింది. తన కన్నతల్లే తన జీవితాన్ని నాశనం చేస్తోందని కూతురు వాపోయింది. తన భర్త కు కూతురు చెప్పి చూసిన ఫలితం లేకుండా పోయింది. పైగా ఆమెను శారీరకంగా హింసించేవాడు. దీంతో చేసేదేమి లేక కూతురు తన స్నేహితురాలి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికను వివాహం చట్టపరంగా చెల్లదని తేల్చేశారు. బాలికను నిర్బంధించి హింసించిన ఆమె మరియు నిందితుడుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉంది. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా వీరికి కఠిన శిక్షలు విధించాలని చుట్టు ప్రక్కల వారు కోరుతున్నారు.

Tags :

Advertisement