Advertisement

  • నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో అస్త్రాన్ని సంధించిన మోదీ ప్రభుత్వం...

నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో అస్త్రాన్ని సంధించిన మోదీ ప్రభుత్వం...

By: chandrasekar Thu, 12 Nov 2020 7:10 PM

నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో అస్త్రాన్ని సంధించిన మోదీ ప్రభుత్వం...


కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడిన సంగతి తెలిసిందే. ఫలితంగా నిరుద్యోగ సమస్య ఏర్పడింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం వివరాలను ప్రెస్‌మీట్‌లో వివరించారు. ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ సంస్థలు అన్నింటికీ ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం వర్తిస్తుంది. దీంతో పాటు మొదటిసారిగా ఉద్యోగం పొందుతున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. అంతేకాదు 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈ పథకం ద్వారా లాభాలు ఉంటాయి. 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య మధ్య ఉద్యోగం కోల్పోయి తిరిగి జాబ్ పొందితే వారిని కేంద్ర ప్రభుత్వం.కొత్త ఉద్యోగిగానే పరిగణిస్తుంది.

ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం 2020 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చినట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే 2020 సెప్టెంబర్ 30న ఉద్యోగం కోల్పోయి ఆ తర్వాత మరో సంస్థలో ఉద్యోగం సంపాదించినా ఈ పథకానికి అర్హులే. ఈ పథకం 2021 జూన్ వరకు అమలులో ఉంటుంది. ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన సంస్థలు కొత్త ఉద్యోగులను లేదా గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తీసుకుంటే ఆ సంస్థలకు ప్రయోజనాలు ఉంటాయి. 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగం కోల్పోయిన వారిని లేదా గతంలో ఈపీఎఫ్ఓలో కవర్ కాని వారిని నియమించుకుంటే వారికి లాభాలు ఉంటాయి. ఆ ఉద్యోగులకు రెండేళ్ల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. యజమాని వాటాతో పాటు, ఉద్యోగి వాటాను కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

కేంద్ర ప్రభుత్వమే ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ద్వారా రెండేళ్ల వరకు కాంట్రిబ్యూషన్ అందిస్తుంది. దీని ద్వారా ఉద్యోగితో పాటు ఆ సంస్థకు కూడా లాభమే. ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన సంస్థలో రూ.15,000 లోపు వేతనంతో చేరే ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. వీరితో పాటు గతంలో రూ.15,000 వేతనం పొందుతున్న వారు 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయి 2020 అక్టోబర్ 1 తర్వాత ఉద్యోగం పొందినట్టైతే వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Tags :

Advertisement