Advertisement

  • బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన 'ఎంఐఎం' పార్టీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన 'ఎంఐఎం' పార్టీ

By: chandrasekar Wed, 11 Nov 2020 09:53 AM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన 'ఎంఐఎం' పార్టీ


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో 'ఎంఐఎం' పార్టీ విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బిహార్‌లో మొత్తం 24 స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలో దింపారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్‌పీ, బీఎస్‌పీతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. ప్రధానంగా సీమాంచల్ ప్రాంతంపై దృష్టి సారించి విజయం సాధించారు. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ కలిసి గ్రాండ్‌ డెమొక్రటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (జీడీఎష్‌ఎఫ్‌)గా ఏర్పడ్డాయి. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చింది. దీంతో 5 స్థానాల్లో విజయం సాధించింది.

ఎంఐఎం బిహార్‌లో పార్టీ విస్తరణ ప్రారంభించిన అనతి కాలంలోనే ఈ ఎన్నికల ద్వారా ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించడం విశేషం. బిహార్‌లో 2019 ఉపఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీ చేసిన ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించింది. తాజాగా ఆ సంఖ్యను 5కు పెంచుకుంది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఎంఐఎం ఈ ఓట్లను చీల్చింది. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. అంతిమంగా మహాఘట్ బంధన్ 'మహాకూటమి' కి ముఖ్యమంత్రి పీఠాన్ని కాకుండా చేసింది. బిహార్‌లో తమ పార్టీకి ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. సీమాంచల్ ప్రాంతం అభివృద్ధి కోసం తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. క్రమంగా ఎంఐఎం పార్టీ తమ ఉనికిని వేరే రాష్ట్రాలలో కూడా చాటుకుంటుంది.

Tags :
|
|

Advertisement