Advertisement

నల్ల గోధుమ పంటకు మార్కెట్‌లో అదిరిపోయే రేటు...

By: chandrasekar Tue, 03 Nov 2020 12:32 PM

నల్ల గోధుమ పంటకు మార్కెట్‌లో అదిరిపోయే రేటు...


కరోనా లాక్ డౌన్ వ్యవసాయ రంగంపైన అంత ప్రభావం చూపలేదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా మంది కరోనా దెబ్బకి సొంత ఊర్లకు వచ్చి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. రేటు ఉన్న పంటలను పండిస్తే.. నష్టం లేకుండా కొంత లాభం పొందొచ్చు. ఇప్పుడు నల్ల గోధుమ (బ్లాక్ వీట్) పంటకు మార్కెట్‌లో అధిక రేటు ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈ పంట పండిస్తే అధిక రాబడి పొందొచ్చు. మార్కెట్‌లో నల్ల గోధుమలకు మంచి రేటు పలుకుతోంది. అంతేకాకుండా డిమాండ్ కూడా ఉంది. రైతులు ఈ పంట పడించి మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. నల్ల గోధుల ధర మార్కెట్‌లో సాధారణ గోధుమలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదేసమయంలో ఈ పంట పండించడానికి కూడా కొంచెం ఎక్కువగానే ఖర్చవుతుంది. సాధారణ గోధుమ ధర మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.2,000 ఉంటే.. నల్ల గోధుమ ధర క్వింటాల్‌కు రూ.7-8 వేల వరకు ఉంటుంది.

అందువల్ల రైతులు నల్ల గోధుమను పండిస్తే మంచి రాబడి పొందొచ్చు. నల్ల గోధుమల్లో న్యూట్రిషన్స్ ఉంటాయి. అందువల్ల పలు రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో నల్ల గోధుమలు ఉపయోగపడతాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్, బ్లడ్ ప్రెజర్, ఒబెసిటీ, షుగర్ ఉన్న వారికి ఈ గోధుమలు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. నల్ల గోధుమలను పండించడానికి నవంబర్ నెల మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పండిస్తే మంచి దిగుబడి పొందొచ్చు. అందువల్ల మీరు కూడా ఈ పంట పండించాలని భావిస్తే.. ఆలస్యం చేయకుండా పని పూర్తి చేయండి. మార్కెట్ లేదా ఫెర్టిలైజర్ సెంటర్లలో నల్ల గోధుమల విత్తనాలను విక్రయిస్తారు.

Tags :
|
|
|

Advertisement