Advertisement

ప్రభుత్వ చర్యల వలన భారీ నష్టం తప్పింది ..

By: Sankar Thu, 20 Aug 2020 12:46 PM

ప్రభుత్వ చర్యల వలన భారీ నష్టం తప్పింది ..


వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం వల్ల భారీ నష్టం తప్పిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆదేశాలతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించి శాశ్వత పరిష్కారం కోసం జిల్లా అధికారులను ఆదేశించారని ఆయన గుర్తు చేశారు.

కొన్ని కాలనీలు జలమయం కావడంతో కరెంట్ సరఫరా నిలిపివేశామని పేర్కొన్నారు. అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సిన వస్తువులు అందిస్తున్నామని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ఆయా పార్టీలను కోరారు. కరోనాతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పాలని వినయ్ భాస్కర్ కోరారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆయన విత్తన గణపతులను పంపిణీ చేశారు.

Tags :
|

Advertisement