Advertisement

  • మరోసారి కంగనాకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

మరోసారి కంగనాకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

By: chandrasekar Mon, 14 Sept 2020 09:11 AM

మరోసారి కంగనాకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం


సుశాంత్ మరణం దర్యాప్తుపై వ్యాఖానించిన కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కంగనా రనౌత్ కు మరియు మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. శివసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కంగనా రనౌత్ ముంబై చేరుకునే సమయంలోనే ఆమె కార్యాలయం అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ (బ్రిహన్‌ముంబై మున్సిపల్‌కార్పొరేషన్‌) అధికారులు కూల్చేశారు.

ఆమె కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్ ముంబైలోని హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్‌దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. దీనిపై రగడ కొనసాగుతుండగానే తాజాగా బీఎంసీ నుంచి కంగనా రనౌత్‌కు మరో నోటీసు అందింది. ఖర్‌లోని ఆమె ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీచేసింది. దీనితో ఆమెకు మళ్ళి షాక్ ఇచ్చినట్లయింది.

కూల్చేసిన పాలీహిల్‌లోని ఆమె కార్యాలయం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌చేసిన వ్యాఖ్యలతో కంగనాకు శివసేనల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.

ఎంపీ సంజయ్‌రౌత్‌ తనను బెదిరించారని తెలుపుతూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. ఇదిలా ఉంటే తన పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌ భగత్‌సింగ్‌కోష్యారీకి కంగనా ఫిర్యాదు చేశారు. మరి రెండవ షాక్ కు ఆమె ఎలా సమాధానం చెపుతుందో వేచి చూడాల్సినే మరి.

Tags :

Advertisement