Advertisement

  • ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు...చలికి వణికిపోతున్న ప్రజలు...

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు...చలికి వణికిపోతున్న ప్రజలు...

By: chandrasekar Sat, 21 Nov 2020 5:43 PM

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు...చలికి వణికిపోతున్న ప్రజలు...


దేశ రాజధానిపై అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు చలికి వణికిపోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యత్ప ఉష్ణోగ్రత నమోదైంది. కనీస ఉష్ణోగ్రత్త 7.5కు పడిపోయింది.

కొండ ప్రాంతాల్లో, మైదానాలలో తీవ్రమైన మంచు కురుస్తున్న కారణంగా ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ అధికారి కులదీప్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

ఢిల్లీలో మరో రెండురోజులు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా దేశరాజధానిలో గాలి నాణ్యత సైతం విపరీతంగా తగ్గింది. పలు ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇన్‌డెక్స్‌ 300కు దిగువగా నమోదైంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం, ఛాందిని చౌక్‌, ద్వారకా, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో గాలిలో నాణ్యత భారీగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది.

Tags :
|

Advertisement