Advertisement

  • దేశంలోనే అతి పొడవైన విజయవాడ కనకదుర్గా ఫ్లైఓవర్ అడ్వాన్స్ టెక్నాలజీతో

దేశంలోనే అతి పొడవైన విజయవాడ కనకదుర్గా ఫ్లైఓవర్ అడ్వాన్స్ టెక్నాలజీతో

By: chandrasekar Tue, 01 Sept 2020 09:40 AM

దేశంలోనే అతి పొడవైన విజయవాడ కనకదుర్గా ఫ్లైఓవర్ అడ్వాన్స్ టెక్నాలజీతో


విజయవాడ కనకదుర్గా ఫ్లైఓవర్‌ దేశంలోనే అతి పొడవైన అడ్వాన్స్‌ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్‌ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతుతిచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీన వర్చువల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్‌ ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ పొడవైన బ్రిడ్జి ని చిత్రీకరించుటకు దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు పంపించింది.ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించింది. చిత్రీకరణలో ఆర్‌ అండ్‌ బీ స్టేట్‌ హైవేస్‌ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. దీని ద్వారా అడ్వాన్స్‌ టెక్నాలజీ గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి వీలు కలుగుతుంది.

మన ఆంధ్ర రాష్ట్రము విజయవాడలో స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై 6 వరసలతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ కావటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. కానీ ఆ రెండింటి కంటే అడ్వాన్స్‌ టెక్నాలజీతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్‌ ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఫ్లై ఓవర్‌ కావటంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాత్రిపూట LED బల్బులతో అత్యంత సుందరంగా అలంకరించబడివుంది.

Tags :

Advertisement