Advertisement

  • ఆందోళన కల్గిస్తున్న వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు

ఆందోళన కల్గిస్తున్న వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు

By: chandrasekar Sat, 29 Aug 2020 12:26 PM

ఆందోళన కల్గిస్తున్న వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అటు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు ఇంకా సమయం పడుతుంది. మరోవైపు వైరస్ పలు చోట్ల తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా తయారవుతోంది.

కరోనా వైరస్ సంక్రమణ అంతకంతకూ మారుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటున్నారు. ఈ నేపధ్యంలో బీఎంజే మెడికల్ జర్నల్ లో వైద్య నిపుణులు పలు కీలకమైన విషయాలు పేర్కొన్నారు. మనిషికి మనిషికి మధ్య ఆరడుగులు దూరం కంటే ఎక్కువ ఉండేలా చూడాలంటున్నారు.

కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న క్రమంలో ఇండోర్ లోనూ, వెలుతురు తక్కువగా ఉన్నచోట ఆరడుగుల కంటే ఎక్కువ దూరం పాటించాలంటున్నారు. మాస్క్ ధరించడం, బయట జనం గడిపే సమయం, జనసాంద్రత వంటి అంశాలు వైరస్ సంక్రమణలో ప్రబావం చూపుతాయని వైద్య నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మీటర్ లేదా మూడు అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెప్పిన నేపధ్యంలో ఇప్పుుడు వైద్య నిపుణుల తాజా హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆరడుగుల దూరం పాటించినంత మాత్రాన కరోనా వైరస్ సోకదని గ్యారంటీ లేదంటున్నారు. అందుకే వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags :

Advertisement