Advertisement

  • లండన్ పరిశోధకుల తాజా అధ్యయనం...కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ!

లండన్ పరిశోధకుల తాజా అధ్యయనం...కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ!

By: chandrasekar Thu, 27 Aug 2020 10:21 AM

లండన్ పరిశోధకుల తాజా అధ్యయనం...కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ!


వాతావరణంలోని సూర్యరశ్మి, కార్బన్‌డై ఆక్సైడ్‌, నీటిని తీసుకొని ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. మొక్కల్లో ఇది జరుగుతుందని తెలుసు. అయితే, కృత్రిమ కిరణజన్య సంయోగక్రియకు లండన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం మార్గం సుగమం చేసింది. ప్రకృతిలోని సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీటిని తీసుకొని దానిని ఫార్మిక్ ఆమ్లం, ఆక్సిజన్ రూపంలో స్వచ్ఛమైన ఇంధనంగా మార్చగల వైర్‌లెస్ పరికరం రూపుదిద్దుకుంది. దీన్ని లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో వారు ఫొటోకాటలిస్ట్‌ షీట్‌ను ఉపయోగించారు. దీని ఉద్దేశం వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ శాతాన్ని తగ్గించడం. ఈ కొత్త వైర్‌లెస్‌ పరికరంలో శాస్త్రవేత్తలు ఉపయోగించిన ఫొటోకాటలిస్ట్‌ షీట్‌ పరిమాణం 20 చదరపు సెం.మీ. వీటిని వాడేందుకు ఈజీగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. భవిష్యత్తులో వీటిని సోలార్స్‌ ప్యానెల్స్‌లాగా వాడొచ్చని చెబుతున్నారు.

అయితే, పరికరం వాణిజ్యీకరణకు సిద్ధంగా ఉండడానికి ముందు మోడల్ సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోబాల్ట్‌ కాకుండా ఇతర ఉత్ప్రేరకాలతో ప్రయోగాలు చేస్తామని చెప్పారు. గతేడాది ఇదే బృందం సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీటిని ఉపయోగించి సింగాస్ అనే ఇంధనాన్ని అభివృద్ధి చేసింది. ఆ ప్రాజెక్టులో వారు ఒక కృత్రిమ ఆకును రూపొందించారు. ‘వాయువు ఇంధనాల నిల్వ, ఉప-ఉత్పత్తుల విభజన సంక్లిష్టంగా ఉంటుంది. మనం ద్రవ ఇంధనాన్ని శుభ్రంగా ఉత్పత్తి చేయగలిగే స్థితికి చేరుకోవాలనుకుంటున్నాం. అది కూడా సులభంగా నిల్వ చేసి రవాణా చేయవచ్చు.’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఎర్విన్ రీస్నర్ తేలిపారు.



Tags :
|

Advertisement