Advertisement

  • సరిహద్దులో చైనా 40,000 మంది సైనికులను మోహరించినట్లు తాజా సమాచారం

సరిహద్దులో చైనా 40,000 మంది సైనికులను మోహరించినట్లు తాజా సమాచారం

By: chandrasekar Thu, 23 July 2020 5:03 PM

సరిహద్దులో చైనా 40,000 మంది సైనికులను మోహరించినట్లు తాజా సమాచారం


చైనా ఇటీవలి జరిగిన చర్చలు, ఒప్పందాలను పక్కన పెట్టి సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వద్దనే తమ దళాలను ఉంచింది. ఫింగర్‌ 5 నుంచి వెళ్లిపోతున్నామని చెప్పినప్పటికీ అలా వెళ్లిపోకుండా మరిన్ని దళాలను అక్కడ మోహరిస్తున్నది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట దళాలను వెనక్కి పిలిపించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.

కానీ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తూర్పు లడఖ్‌కు ఎదురుగా ఉన్నసరిహద్దులో 40,000 మంది సైనికులను మోహరించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది వాహకాలతోపాటు ఎక్కువ దూరం లక్ష్యాలపై శతఘ్నులను వదిలే ఫిరంగులు వంటి సైనిక అంశాలను ఫింగర్‌ 5 ప్రాంతంలో నిలుపుకున్నట్టుగా తెలుస్తున్నది. ఫింగర్ 5 ప్రాంతం నుంచి సైనికులను ఉపసంహరించుకోవటానికి చైనా విముఖత చూపిస్తున్నదని, వారు ఈ ప్రాంతంలో ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారని ఆ వర్గాల ద్వారా తెలిసింది.

హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాలను ఆక్రమిస్తున్న చైనీయులు తాము వెనక్కి వెళ్తే భారతీయులు ఆయా ప్రాంతాలను ఆక్రమిస్తారని వాదిస్తున్నది. జూలై 14-15 తేదీల్లో జరిగిన చివరి సమావేశంలో దళాలను వెనక్కి పిలిపించడంలో సాధించిన పురోగతిని కూడా పర్యవేక్షించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య ఇప్పటివరకు అనేక సమావేశాలు జరిగాయి. ఎల్‌ఏసీ వెంట ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

Tags :
|
|

Advertisement