Advertisement

  • కొరియా కియా కార్ల పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది

కొరియా కియా కార్ల పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది

By: Sankar Wed, 20 May 2020 3:41 PM

కొరియా కియా కార్ల పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది


విశాఖపట్టణంలో గ్యాస్‌ లీక్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయ చర్యలు అందించేందుకు 200 మందితో ఎల్జీ పాలిమర్స్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గ్యాస్‌ ప్రమాద బాధితులు గతంలో లాగానే సాధారణ జీవితం గడిపేందుకు అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తాము. ముఖ్యమంత్రి ఆదేశాలతో విశాఖపట్నం ఎల్జీ పరిశ్రమ నుండి దక్షిణ కొరియాకు స్టైరైన్‌ తరలింపు ప్రక్రియ ముగిసింది. గ్యాస్‌ లీక్‌ పరిసర ప్రాంతాల్లోని 5 గ్రామాల ప్రజలకు, ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని' మంత్రి చెప్పారు. గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

kia,car,vizag,gas leakage,industry ,కియా, కార్ల, విశాఖపట్టణం, గ్యాస్‌ లీక్‌, సహాయక చర్యలు


అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమ మంగళవారం నుంచి ప్రారంభమైంది. త్వరలోనే ఉత్పాదక రంగంలో కియాకార్ల తయారీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర చూపిస్తుంది. పరిశ్రమలో విధులు నిర్వర్తించే ఉద్యోగుల రక్షణతో పాటు, పనిచేసే కాలంలో పాటించవలసిన ప్రాధాన్యతలపై ప్రభుత్వం ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రకటించారు.

Tags :
|
|
|

Advertisement