Advertisement

  • ఆ కిడ్నాప్‌...ఈసీఐఎల్‌ వద్ద జరగలేదు...కర్నాటక కొల్లార్‌ ప్రాంతంలో

ఆ కిడ్నాప్‌...ఈసీఐఎల్‌ వద్ద జరగలేదు...కర్నాటక కొల్లార్‌ ప్రాంతంలో

By: chandrasekar Fri, 02 Oct 2020 6:05 PM

ఆ కిడ్నాప్‌...ఈసీఐఎల్‌ వద్ద జరగలేదు...కర్నాటక కొల్లార్‌ ప్రాంతంలో


గత రెండు, మూడు రోజుల క్రితం నీలిరంగు దుస్తులు ధరించి మరో యువతితో కలిసి రోడ్డుపై వెళ్తున్న యువతిని తెలుపు రంగు ఇన్నోవాలో వచ్చి కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

కొంతమంది తెలియక ఈ కిడ్నాప్‌ ఘటన ఈసీఐఎల్‌ ప్రాంతంలో జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ కావడంతో రాచకొండ పోలీసులు గందరగోళానికి గురయ్యారు. ప్రాథమికంగా రాచకొండ పోలీసులు పలు సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత ఆ ఘటన ఈసీఐఎల్‌లో కాదని కర్నాటక కోల్లార్‌ పట్టణంలో ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు నిర్ధారించారు.

శివశంకర్‌ అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో యువతిని కిడ్నాప్‌ చేశాడని వివరించారు. కిడ్నాప్‌నకు పాల్పడ్డ శివశంకర్‌ను కర్నాటక పోలీసులు అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను ఈసీఐఎల్‌లో జరిగిందని వైరల్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరోసారి అసలు నిజాన్ని దాచిపెట్టి తప్పుడు సమాచారంతో వీడియోలను వైరల్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.

Tags :

Advertisement