Advertisement

  • ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కోసం జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు

ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కోసం జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు

By: chandrasekar Fri, 11 Dec 2020 5:28 PM

ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కోసం జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు


తెలంగాణాలో పనిచేస్తున్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీకి తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఆ అధికారిని ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పై తీసుకురావాలని భావించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా ఇంతకుముందు కేంద్ర హోంశాఖ అంగీకరించలేదు. ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు స్టీఫెన్ రవీంద్ర. మరోసారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటేషన్ పై తీసుకురావడానికి యత్నిస్తున్నారు. దీనికోసం ఏపీ సర్కార్ కేంద్రం ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఈ వ్యహారంపై మాట్లాడినట్లు తెలిసింది.

దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్దారణ అందలేదు. అందువల్ల మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. కొత్త ఏడాదిలోనైనా ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారని తెలిసింది. జగన్ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సంక్రాంతి తర్వాత రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో ఇంటిలిజెన్స్ విభాగం చాలా కీలకం కానుంది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ తీరుపై ప్రజల్లో స్పందన వంటి అంశాలను ఇంటిలిజెన్స్ ద్వారా గుర్తించబడుతుంది.

అందుకే ఆయన్ను ఏపీకి తీసుకొచ్చి ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఏడాదిన్నరగా సాగుతోందని తెలిసింది. కానీ ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. తెలంగాణాలో పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంపై ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఓ మంచి పోలీస్ అధికారి. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తిగా చెప్పారు. అటువంటి అధికారి, ఇంతటి ప్రశ్నార్థకమైన పరిపాలన, పలు అవినీతి కేసుల్లో ముద్దాయి అయిన ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రానికి "ఇంటెలిజెన్స్ చీఫ్" గా వస్తారని ఆయన తెలిసిన వ్యక్తిగా తాను అనుకోను అని చెప్పారు. స్టీఫెన్ రవీంద్ర 1990 బ్యాచ్‌లో సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.

వరంగల్ జిల్లా పరకాలలో 1999లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్‌ ఆ తరువాత 2004లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అదే ఏడాది డిసెంబరులో వరంగల్ జిల్లా ఎస్పీగా, 2010లో హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. రాయలసీమలోనూ అయన బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వత ఆయన తెలంగాణకు వెళ్లి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పడు ఆయన హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌‌గా ఉన్నారు. అందువల్ల ఈయన పై ప్రత్యేక శ్రద్ధతో ఏపీ కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags :
|
|

Advertisement