Advertisement

  • కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ధరలు భారీగా తగ్గించిన జగన్ ప్రభుత్వం...

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ధరలు భారీగా తగ్గించిన జగన్ ప్రభుత్వం...

By: chandrasekar Tue, 15 Dec 2020 10:24 PM

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ధరలు భారీగా తగ్గించిన జగన్ ప్రభుత్వం...


వైసీపీ ప్రభుత్వం కరోనా పరీక్షల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఏబీఎల్‌ ల్యాబుల్లో కరోనా టెస్టు ధరను రూ. 1,000 నుంచి రూ.499కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టు ధరలను రూ.800 నుంచి రూ.475కు తగ్గించింది.

మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 500 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,76,336కి చేరింది. అలాగే కరోనా మరణాలు కూడా రాష్ట్రంలో స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. కరోనా మరణాలు సైతం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడి ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,064కు చేరింది.

Tags :

Advertisement