Advertisement

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం

By: chandrasekar Thu, 08 Oct 2020 09:32 AM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం


కరోనా వల్ల ఆర్ధిక లోటు ఏర్పడడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా కారణంగా వారి జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న జీతాలు, డీఏ బకాయిలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఒక డీఏతో సహా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం చెల్లింపు ప్రక్రియను ఐదు విడతలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని సూచించారు. కాగా, ఉద్యోగ సంఘాలు మాత్రం మిగిలిన రెండు బకాయిలను కూడా త్వరగా చెల్లించాలని కోరుతున్నాయి.

Tags :
|

Advertisement