Advertisement

  • కొత్త సంక్షేమ పథకాలను తీసికొనివచ్చిన జగన్ ప్రభుత్వం

కొత్త సంక్షేమ పథకాలను తీసికొనివచ్చిన జగన్ ప్రభుత్వం

By: chandrasekar Fri, 21 Aug 2020 09:27 AM

కొత్త సంక్షేమ పథకాలను తీసికొనివచ్చిన జగన్ ప్రభుత్వం


ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు పరచడం వల్ల అనేక మంది పేదలు లబ్ది పొందుతున్నారు. వైస్సార్ కాంగ్రెస్ విజయం తరువాత జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

కొత్తగా పేదల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం కూడా లభించింది. బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే అతనిని ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేది. కానీ దీనిని కొద్ది రోజుల క్రితం ఉపసంహరించుకుంది.

ప్రస్తుతం పేదల కోసం ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది.

బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వుండే వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు. శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు చెల్లిస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. ఈ సంక్షేమ పధకం వల్ల అనేక పేద కుటుంబాలు లబ్ది పొందుతాయని వివరించారు.

Tags :

Advertisement