Advertisement

  • పాకిస్థాన్‌లో ఆగని అరాచకాలు... దారుణంగా హాత్య చేయబడ్డ హిందూ మతానికి చెందిన డాక్టర్

పాకిస్థాన్‌లో ఆగని అరాచకాలు... దారుణంగా హాత్య చేయబడ్డ హిందూ మతానికి చెందిన డాక్టర్

By: chandrasekar Wed, 16 Sept 2020 07:47 AM

పాకిస్థాన్‌లో ఆగని అరాచకాలు... దారుణంగా హాత్య చేయబడ్డ హిందూ మతానికి చెందిన డాక్టర్


పాకిస్థాన్‌లో రోజు రోజుకి హిందువులపై దారుణాలు అధికమవుతూనే వున్నాయి. ప్రస్తుతం వైద్య వృత్తిలో వున్న హిందూ డాక్టర్ ను అతి దారుణంగా హాత్య చేశారు. పాకిస్థాన్‌లో మరో హిందూ వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. సింధ్ ప్రావిన్స్‌లోని తాండో అల్లిహార్‌లో డాక్టర్ లాల్ చంద్ బాగ్రి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతడి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచి చంపారు. శరీరంపై పలు కత్తి గాయాలను పోలీసులు కనుగొన్నారు.

గడచిన ఏడాది కాలంగా హిందూ వైద్యుడిపై హత్య జరుగడం ఇది రెండోది. గతేడాది కరాచీ సమీపంలోని లార్కనాలోని గర్ల్స్ హాస్టల్‌లో డాక్టర్ నమ్రతా చందాని మృతదేహం లభ్యమైంది. లైంగిక దాడి అనంతరం నమ్రతను దారుణంగా చంపారని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. తాండో అల్లిహార్ సింధ్ ప్రావిన్స్ లోని ఒక పట్టణం. సింధీ వర్గానికి చెందిన చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. లాల్ చంద్ కూడా సింధు సంఘం నుంచి వచ్చారు. అతడు తన క్లినిక్ ను ఇంట్లోనే నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తిలో ఉండేటప్పుడు గుర్తు తెలియని కొందరు అతనిని హత్యచేశారు.

సోమవారం రాత్రి కొంతమంది అతని ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో పొడిచి పరారయ్యారు. కత్తితో పొడవడంతో ఆ డాక్టర్ మరణించాడు. ఈ సంఘటన గురించి ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరు ఈ దాడికి పాల్పడింది ఇంకా తెలియరాలేదు. సింధ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాగ్రి స్నేహితులను విచారిస్తూ సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కావున వివరాలు తెలియరాలేదు.

హిందూ మతానికి చెందిన డాక్టర్ నమ్రత చందాని మృతదేహం గతేడాది సెప్టెంబర్ 16 న లార్కనాలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో లభించింది. ఆమె బెనజీర్ భుట్టో కుటుంబం నడుపుతున్న బీబీ ఆసిఫా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి. నమ్రత సోదరుడు విశాల్ కరాచీలో పెద్ద సర్జన్‌గా ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నమ్రత కుటుంబానికి న్యాయం చేయాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చాలానే పాకిస్థాన్లో చోటుచేసుకుంటున్నాయి.

Tags :

Advertisement