Advertisement

  • మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన...కేంద్రం క్లారిటీ...

మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన...కేంద్రం క్లారిటీ...

By: chandrasekar Thu, 12 Nov 2020 10:28 PM

మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన...కేంద్రం క్లారిటీ...


కరోనా పూర్తిగా అదుపులోకి రాని కారణంగా కేంద్రం మరోసారి లాక్‌డౌన్ విధించే యోచనలో ఉందని పలుసార్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం గతంలోనే క్లారిటీ ఇచ్చింది. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు సంబంధించిన ఫేక్ న్యూస్ ఆగడం లేదు. తాజాగా కేంద్రం మరోసారి లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచిస్తోందనే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో డిసెంబర్ 1 నుంచి మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారన్నది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ అందరినీ గాందరగోళంలో పడేస్తోంది. అయితే దీనిపై మరోసారి కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ ట్వీట్ మార్ఫింగ్ చేసినట్టు ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ప్రకటించింది.

ప్రభుత్వం లాక్‌డౌన్ విధింపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని.. దీన్ని ఎవరూ ప్రచారం చేయొద్దని సూచించింది. మరోవైపు దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 5 మార్గదర్శకాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ చివరిలో వీటిని విడుదల చేసిన కేంద్రం నవంబర్ 30 వరకు ఈ అన్‌లాక్ 5 మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలియచేసింది.

Tags :
|

Advertisement