Advertisement

  • వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగ్ కి రామని చెప్తున్న హీరోలు, దర్శక నిర్మాతలు

వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగ్ కి రామని చెప్తున్న హీరోలు, దర్శక నిర్మాతలు

By: chandrasekar Sat, 11 July 2020 4:55 PM

వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగ్ కి రామని చెప్తున్న హీరోలు, దర్శక నిర్మాతలు


ప్రభుత్వం షూటింగ్స్ చేసుకోడానికి అన్నిరకాల అనుమతులు యిచ్చినా షూటింగ్స్ చేయడం లేదు. ఇప్పటి వరకు చిన్నా చితకా సినిమాలు తప్ప పెద్ద వాళ్లెవ్వరూ కూడా బయటికి రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు వెళ్లి ప్రభుత్వంతో తమ గోడు వెల్లబోసుకోవడంతో బాగా ఆలోచించి కొన్ని నియమ నిబంధనలు పాటించమని చెప్పి షూటింగ్ చేసుకోడానికి అనుమతులు ఇచ్చారు.

అందులో భౌతిక దూరం ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి, ఎక్కువ మంది ఉండకూదు, ఇన్‌డోర్ షూటింగ్ చేసుకోవాలి, ముసలి వాళ్లకు ప్రవేశం లేదు లాంటి నియమాలు చాలానే ఉన్నాయి. కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. వీటితోనే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని ఇండస్ట్రీలు షూటింగ్స్ మొదలు పెట్టి మళ్లీ ఆపేసారు. తమిళ సీరియల్స్ షూటింగ్స్ అనుమతులు ఆపేసారు.

మరోవైపు బెంగాలీ వాళ్లు కూడా నేడో రేపో అంటున్నారు. కానీ తెలుగులో మాత్రం ఇంకా అటు వైపు అడుగులు పడటం లేదు. సీరియల్ షూటింగ్స్ మొదలు పెట్టినా కూడా సినిమాలు కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. తెలుగులో చాలా మంది నటీనటులు కరోనా ఓ గాడిన పడేవరకు కూడా తాము షూటింగ్స్‌కు రామని నిర్మాతలకు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ వస్తే కానీ తాము షూటింగ్ వైపు రామని చెప్తున్నారు హీరోలు, దర్శక నిర్మాతలు. పైగా హైదరాబాద్‌లో అయితే మరీ దారుణంగా ఉంది కరోనా వైరస్.

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా కోరల్లోనే ఉన్నాయి. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము షూటింగ్‌కు రాలేమని చెప్తున్నారు నటీనటులు. అందుకే అనుమతులు వచ్చినా కూడా నిర్మాతలు కూడా ఏం చేయలేకపోతున్నారు. సినిమా షూటింగ్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. తెలుగులో చాలా మంది హీరోలకు వయసు 60 దాటిపోయింది. నలుగురు అగ్ర హీరోల వయసు కూడా 60పైనే. దానికి తోడు పవన్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా 50కి అటూ ఇటూగా ఉన్నారు. ఇంకా చాలా మంది హీరోల వయసు కూడా 40కి చేరువలోనే ఉంది. కుర్ర హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించి షూటింగ్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. అందుకే మరికొన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు కానీ కరోనా కట్టడైన తర్వాతే పెట్టుకుందామని వాళ్లు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అనుమతి ఉన్నా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. మొన్నామధ్య రాజమౌళి ట్రిపుల్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టాలని చూసినా కూడా వీలుపడలేదు.

Tags :

Advertisement