Advertisement

  • ద్యుతీ ఆర్థిక సాయం వివరాలు విడుదల చేసిన ఒడిశా ప్రభుత్వం

ద్యుతీ ఆర్థిక సాయం వివరాలు విడుదల చేసిన ఒడిశా ప్రభుత్వం

By: chandrasekar Fri, 17 July 2020 5:19 PM

ద్యుతీ ఆర్థిక సాయం వివరాలు విడుదల చేసిన ఒడిశా ప్రభుత్వం


ఒడిశా ప్రభుత్వం భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్కు 2015 నుంచి ఇప్పటి వరకు రూ.4.09కోట్ల ఆర్థిక సాయం చేశామని ప్రకటించింది. దీంతో పాటు ఒడిశా గనుల కార్పొరేషన్లో గ్రూప్-ఏ ఆఫీసర్గా ఆమెకు ఉద్యోగం ఇచ్చామని, నెలకు రూ.84,604 వేతనం పొందుతున్నదంటూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ద్యుతీ తన లగ్జరీ కారును అమ్మాలనుకుంటున్నట్టు ఇటీవల ఫేస్బుక్లో పోస్ట్ చేసి తర్వాత దాన్ని తొలగించింది. అయితే శిక్షణకు డబ్బు లేకనే ద్యుతీ ఇలా చేసిందని వాదనలు వచ్చాయి. కాగా లగ్జరీ కారు మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేకనే విక్రయించాలనుకున్నానని ద్యుతీ స్పష్టతనిచ్చింది.

ఈ నేపథ్యంలో ద్యుతీకు చేసిన ఆర్థిక సాయం గురించి ఒడిశా ప్రభుత్వం వివరాలు వెల్లడించవలసి వచ్చింది. “2018లో ఆసియా గేమ్స్ లో పతకం గెలిచినప్పుడు ద్యుతీ చంద్కు రూ.3కోట్ల ఆర్థిక సాయం చేశాం. 2015-19 వరకు శిక్షణ తీసుకునేందుకు రూ.30లక్షలు ఇచ్చాం. అలాగే టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమయ్యేందుకు రెండు విడతల్లో రూ.50లక్షలు కేటాయించాం. ద్యుతీని ఒడిశా గనుల కార్పొరేషన్లో గ్రూప్-ఏ ఆఫీసర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఆమె ప్రతి నెలా రూ.84,604 వేతనం పొందుతున్నది. ఆమె కార్యాలయానికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఆమెకు ఎలాంటి పనులు కేటాయించడం లేదు. ఆమె పూర్తిగా శిక్షణపైనే ఏకాగ్రత ఉంచొచ్చు” అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

Tags :
|

Advertisement