Advertisement

  • అత్యధిక కోవిడ్-19 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అత్యధిక కోవిడ్-19 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

By: chandrasekar Sat, 06 June 2020 6:46 PM

అత్యధిక  కోవిడ్-19 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు కెక్కింది నాలుగు లక్షలు దాటిన పరీక్షలు. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,13,773 లక్షల మందకి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4112 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3377 మంది ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది ఉన్నారు. 2020 మే 1 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా నెల రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 4లక్షలు దాటింది.

ప్రభుత్వం పరీక్షల సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడంతో మొత్తం 4,13,733 కోవిడ్ టెస్టుల మైలురాయిని చేరింది. ఒక మిలియన్ జనాభాకు ఆంధ్రప్రదేశ్ లో 7748 టెస్టులు జరుగుతున్నాయని, దేశంలోనే అత్యధిక టెస్టులు జరుగుతున్న రాష్ట్రం ఏపీనేనని వెల్లడించారు. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో ప్రపంచ, జాతీయ సగటుతో పోల్చినపుడు ఏపీ మెరుగైన స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన కఠినమైన విధానాలతో కరోనాను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Advertisement