Advertisement

  • ఆన్‌లైన్‌లో నమోదు చేయని మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు అనుమతి...

ఆన్‌లైన్‌లో నమోదు చేయని మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు అనుమతి...

By: chandrasekar Wed, 09 Dec 2020 4:42 PM

ఆన్‌లైన్‌లో నమోదు చేయని మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు అనుమతి...


వ్యవసాయ అధికారుల వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోనటువంటి మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అనుమతి మంజూరైందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఈ నేపథ్యంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారి మొక్కజొన్నలు మాత్రం కొనుగోలు చేస్తున్నారనే విషయం రైతులు తన దృష్టికి తీసుకవచ్చారని చెప్పారు.

క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి మొక్కజొన్న పంటలు ఆన్‌లైన్‌లో నమోదు కానీ వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఈ మేరకు జిల్లాలో 1146 మంది రైతులకు సంబంధించిన 2,375 ఎకరాల్లో పండిన పంటను ప్రభుత్వం రూ.1850 కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో మార్క్‌ఫెడ్‌ అధికారులు సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా రైతుల వద్ద నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని తెలిపారు.

Tags :
|
|

Advertisement