Advertisement

  • ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీచేసిన అధికార ప్రభుత్వం

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీచేసిన అధికార ప్రభుత్వం

By: chandrasekar Mon, 28 Sept 2020 12:51 PM

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీచేసిన అధికార ప్రభుత్వం


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అధికార ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఇంటితో పాటూ కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చారు.

ప్రస్తుతం నదిలో వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఉదృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇళ్లల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. కృష్ణా నదిలో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో నీటిని కిందకు వదులుతున్నారు.

కృష్ణా నదిలో పోటెత్తిన ఈ వరద ప్రవాహం వల్ల విజయవాడ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. వరద ఉదృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకే చంద్రబాబుతో పాటూ కరకట్టపై ఉన్న ఇళ్లు, ఇతర భవనాలకు నోటీసులు ఇస్తున్నారు. గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

నదిలో వరద నీరు ఉదృతి కావడంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయంగా పెను దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి వరద పెరిగేలా చేసి చంద్రబాబు నివాసం ఉండే ఇల్లు మునిగేలా చేస్తారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సంవత్సరం కూడా నోటీసులు జారీ చేయడంతో మరి వీళ్ళ స్పందన ఎలా ఉంటుందే వేచి చూడాల్సిందే. వర్షాలు బాగా పడడంతో నీటి ప్రవాహం కృష్ణా నదిలో భారీ ప్రవాహంగా మారింది.

Tags :
|

Advertisement