Advertisement

  • దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం

దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం

By: chandrasekar Tue, 29 Sept 2020 6:02 PM

దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం


కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిఫెన్స్‌ అక్విజిషన్‌ ప్రొసీజర్‌ను సోమవారం విడుదల చేశారు. సౌత్‌బ్లాక్‌లో జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో విడుదల చేసినట్లు రక్షణ మంత్రి కార్యాలయం సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపింది. డీఏపీ-2020 ప్రధానమంత్రి విజన్‌తో అలైన్‌మెంట్‌ చేయబడిందని,

దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా భారతీయ దేశీయ పరిశ్రమకు సాధారతను కల్పిస్తుందని తెలిపారు. కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం ప్రకటించబడింది, డీఏపీ భారతీయ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడుతూ దిగుమతి, ఎగుమతుల కోసం తయారీ హబ్‌లను స్థాపించడానికి ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు పలు నిబంధనలను చేర్చినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇండియన్-ఐడీడీఎం, మేక్-I, మేక్-II, డిజైన్ డెవలప్‌మెంట్‌లో ప్రొడక్షన్ ఏజెన్సీ, ఓఎఫ్‌బీ/డీపీఎస్‌యూ, ఎస్పీ మోడల్‌లు ప్రత్యేకంగా భారతీయ అమ్మకందారుల కోసం నివాస భారతీయ పౌరుల యాజమాన్యం, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని రక్షణ మంత్రి మరో ట్వీట్‌లో తెలిపారు. కొత్త విధానాన్ని డిఫెన్స్‌ అక్విజిషన్‌ ప్రొసీజర్స్‌లో కొత్త అధ్యాయంగా ప్రవేశ పెట్టారు. సేవలకు కాపిటల్ బడ్జెట్ ద్వారా అవసరమైన వస్తువులను సరళమైన పద్ధతిలో సమయానుసారంగా సేకరించడానికి వీలు కల్పించేలా ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రి కార్యాలయం పేర్కొన్నది.

Tags :
|

Advertisement