Advertisement

  • పుతిన్ ప్రత్యర్థిపై సోవియెట్ నాటి విషప్రయోగం జరిగిందని జర్మనీ ప్రభుత్వం ఆరోపణ

పుతిన్ ప్రత్యర్థిపై సోవియెట్ నాటి విషప్రయోగం జరిగిందని జర్మనీ ప్రభుత్వం ఆరోపణ

By: chandrasekar Fri, 04 Sept 2020 11:39 AM

పుతిన్ ప్రత్యర్థిపై సోవియెట్ నాటి విషప్రయోగం జరిగిందని జర్మనీ ప్రభుత్వం ఆరోపణ


జర్మనీ ప్రభుత్వం సోవియట్‌ కాలం నాటి కెమికల్‌ నెర్వ్‌ ఏజెంట్‌ ‘నొవిచోక్‌' ద్వారానే రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని బుధవారం పేర్కొంది. దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

2018లో బ్రిటన్‌లో మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్‌, ఆయన కుమార్తెపై కూడా నొవిచోక్‌ ద్వారానే విషప్రయోగం చేసారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే నావల్నీని అంతమొందిచేందుకే ఈ విషప్రయోగం జరిగిందని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆరోపించారు.

రసాయనిక ఆయుధం వాడడం అసాధారణమని, దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోరారు. మరోవైపు, ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.

Tags :

Advertisement