Advertisement

  • కోహ్లి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు

కోహ్లి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు

By: chandrasekar Sat, 22 Aug 2020 02:38 AM

కోహ్లి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు


యూఏఈలో వచ్చే నెలలో ఐపీఎల్‌ జరుగనున్న నేపథ్యంలో క్రీడాకారులు యూఏఈ కి చేరుకుంటున్నారు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్‌ ఎలెవన్‌, కోల్‌కతా జట్లు యూఏఈ చేరగా శుక్రవారం ముంబై, చెన్నై, ఆర్‌సీబీ జట్లు కూడా ప్రత్యేక విమానాల్లో యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరట్స్‌కు బయల్దేరాయి.

ఆర్‌సీబీ ఆటగాళ్లు యూఏఈ వెళ్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఫొటోల్లో ఎక్కడా కూడా విరాట్‌ కోహ్లి కనిపించడం లేదు. ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ మాస్కులు, ఫేస్‌ కవర్లు ధరించి ఉండడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పార్థివ్‌ పటేల్‌, చాహల్, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, నవదీప్‌ శైనీ, సుందర్‌, పవన్‌నేగి తదితర ఆటగాళ్లు బాగానే కనిపిస్తుండగా మిగతావాళ్లను మాత్రం గుర్తించలేకుండా ఉంది.

అయితే వారిలో విరాట్‌ కోహ్లి కనిపించడం లేదు. దీంతో ఆర్‌సీబీ అభిమానుల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. ‘కోహ్లి కనిపించడం లేదు’, ‘కోహ్లి ప్రత్యేక విమానంలో వస్తున్నాడా’ అని విరాట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే కోహ్లి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్‌ గెలువలేదు. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ ప్రతీసారి ఏదో విషయంలో దెబ్బతింటుంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో విరాట్‌తో పాటు జట్టు సభ్యులు ఉన్నట్లు సమాచారం.

Tags :
|

Advertisement