Advertisement

  • కృష్ణా వరద జలాల పై ఏపీ, తెలంగాణల వాదనలను కేంద్రం దృష్టికి

కృష్ణా వరద జలాల పై ఏపీ, తెలంగాణల వాదనలను కేంద్రం దృష్టికి

By: chandrasekar Fri, 05 June 2020 5:40 PM

కృష్ణా వరద జలాల పై ఏపీ, తెలంగాణల వాదనలను కేంద్రం దృష్టికి


సుదీర్ఘ సమావేశం అనంతరం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పరమేశం మీడియాతో మాట్లాడారు. కృష్ణా వరద జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణల వాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పరమేశం తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నీటి వివాదంపై గురువారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల ఉన్నతాధికారులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను బోర్డు దృష్టికి తీసుకొచ్చాయి. ఏపీ, తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ అంశంతో పాటు, టెలిమెట్రీల ఏర్పాటు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ సుదీర్ఘ సమావేశం అనంతరం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పరమేశం మీడియాతో మాట్లాడారు. కృష్ణా వరద జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణల వాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పరమేశం తెలిపారు.

కృష్ణా నదిపై నిర్మించే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు తమకు సమర్పించాలని కోరినట్లు పరమేశం తెలిపారు. అలాగే గత ఏడాది తీసుకున్నట్లు గానే ఈ సంవత్సరంలో కూడా ఏపీ, తెలంగాణ వరుసగా 66:34 నిష్పత్తిలో నీటిని తీసుకొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని చెప్పారు. శ్రీశైలంలో విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం వాడుకునేలా ఒప్పందం కుదిరిందని అన్నారు.

the focus,of the,ap and telangana,claims on,krishna flood waters ,కృష్ణా వరద జలాల పై, ఏపీ, తెలంగాణల, వాదనలను, కేంద్రం దృష్టికి


రెండో దశ టెలిమెట్రీల వ్యవస్థను అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ ఏడాది నీటి వినియోగాలపై చర్చించాము. శ్రీశైలం-సాగర్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో పలు అంశాలను లెవనెత్తింది. దానికి ఏపీ పలు అభ్యంతరాలను తెలిపింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపాం. దీనిపై వాళ్లే తుది నిర్ణయం తీసుకుంటారు. రెండు రాష్ట్రాల నుంచి వారు చేపట్టే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు మాకు అందాక ఆయా ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించాం.

ఈ సమావేశంలో బోర్డు చైర్మన్‌ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆదిత్యాథ్‌ దాస్‌ బోర్డు ముందు వాదనలు వినిపించారు. తెలంగాణ తరపున రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనల వినిపించారు.

Tags :
|

Advertisement