Advertisement

తొలి విడతగా ఐదు రాఫెల్ విమానాలు భారత్ కు

By: chandrasekar Mon, 27 July 2020 7:07 PM

తొలి విడతగా ఐదు రాఫెల్ విమానాలు భారత్ కు


ఫ్రాన్స్ నుండి భారత్ అధునాతన యుద్ధ విమానాలు రాఫెల్ కొనుగోలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వీటిలో మొదటి విడతగా ఐదు యుద్ధ విమానాలు బుధవారం భారత్ చేరుకోనున్నాయి. భారత వాయుసేనకు మరింత బలం చేకూరనుంది. ఈనెల 29న రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. భారత వాయుసేనకు మరింత బలం చేకూరనుంది. తొలి విడతలో మొత్తం ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు సుమారు 7364 కిలోమీటర్లు ప్రయాణించి భారత్ చేరుకోనున్నాయి. ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయల్ రిఫిల్లింగ్ వ్యవస్థ, అత్యాధునిక సాంకేతికతో ఈ యుద్ధ విమానాలు శత్రువుల పాలిట కాలయముడిలా మారనున్నాయి రాఫేల్ విమానాలు.

అత్యాధునిక వ్యవస్థ కలిగిన ఈ యుద్ధ విమానాలు ఈరోజు ఫ్రాన్స్ నుండి బయలు దేరనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫ్రెంచ్ ఎయిర్ బేస్ లో ఈ యుద్ధ విమానాలు ఒక సారి ఆగనున్నాయి. అనంతరం అవి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ చేరుకోనున్నాయి. మొత్తం 36 ఎయిర్ క్రాఫ్ట్ లు అందించేలా భారత్-ఫ్రాన్స్ మధ్య రూ.59 వేల కోట్లతో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు బుధవారం రోజు భారత్ కు చేరుకోనున్నాయి.

Tags :
|

Advertisement