Advertisement

  • మొదటి 3 రోజులు తిరుమల, తిరుపతిలోని స్థానికులకు మాత్రమే దర్శనం

మొదటి 3 రోజులు తిరుమల, తిరుపతిలోని స్థానికులకు మాత్రమే దర్శనం

By: chandrasekar Fri, 05 June 2020 12:23 PM

మొదటి 3 రోజులు తిరుమల, తిరుపతిలోని స్థానికులకు మాత్రమే దర్శనం


చైనా సృష్టించిన అత్యంత వినాశకరమైన వైరస్ కారనంగా కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం 128 సంవత్సరాల తర్వాత సాధారణ భక్తుల దర్శనానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు 3 నెలల అనంతరం మళ్లీ ఆలయాన్ని సాధారణ భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.

జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు. తిరుమలలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరంతో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ముందుగా మొదటి మూడు రోజులు ప్రయోగాత్మకంగా తిరుమల, తిరుపతిలోని స్థానికులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.

గంటకు 300 మంది చొప్పున రోజుకు 15 గంటలు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది. సామాజిక దూరం తప్పనిసరి. సాధారణ భక్తులను అనుమతించే తేదీని ఇంకా ప్రకటించలేదు. అనంతరం పరిస్థితులను పరిశీలించి ఇతర భక్తులకు అనుమతి కల్పిస్తారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా కళకళలాడే శ్రీ తిరుమల క్షేత్రం నిర్మానుష్యంగా చూసిన వారు ఎవరూ భూమి మీద కరోనా ముందు వరకు లేరు. ఆ దృశ్యం కరోనా వల్ల కనిపించింది. ఎట్టకేలకు స్వామి వారి దర్శనం మళ్లీ లభించనుంది. దర్శనం కోసం స్వామి వారు అనుగ్రహం ఎవరిపై ఉందో మరి.

Tags :
|
|
|

Advertisement