Advertisement

ఆర్ధిక రాజధాని ముంబాయి అంధకారంలో

By: chandrasekar Mon, 12 Oct 2020 8:47 PM

ఆర్ధిక రాజధాని ముంబాయి అంధకారంలో


ఆర్ధిక రాజధాని ముంబాయి అంధకారంలోకి వెళ్ళింది. విద్యుత్ సరఫరా కొన్ని ప్రాంతాలకు ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తినది. దేశ ఆర్ధిక రాజధాని ముంబాయి అంధకారంలో మునిగిపోయింది. వెస్టర్న్ పవర్ గ్రిడ్ విఫలమవడంతో అత్యధిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోకల్ రైళ్లు సైతం నిలిచిపోయాయి. ముంబాయి నగరంలోని వెస్టర్న్ పవర్ గ్రిడ్ ఫెయిల్ అవడంతో నగరంలోని అత్యధిక ప్రాంతాలకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో అత్యవసర సేవల నిమిత్తం నడుపుతున్న ముంబాయి లైఫ్ లైన్ లోకల్ ట్రైన్లపై ప్రభావం పడింది. విద్యుత్ కోత కారణంగా జూహూ, అంధేరీ, మీరా రోడ్, నవీ ముంబాయి, థాణే, పన్వేల్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గ్రిడ్ ఫెయిల్ అయిన కారణంగా నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని బృహన్ ముంబాయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. టాటా సంస్థ నుంచి వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తిందన్నారు.

ఆర్ధిక రాజధాని కావడంతో విద్యుత్ వినియోగం అధికంగా ఇక్కడ అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బెస్ట్, అదానీ ఎలక్ట్రిసిటీ, టాటా పవర్ సప్లై సహా పలు ఆపరేటర్లు నగరంలో ఉన్నారు. అదానీ విద్యుత్ కంపెనీ 5 వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించి ముంబాయి నగరానికి సరఫరా చేస్తోంది. ముంబాయి నగరానికి రోజుకు 16 వందల నుంచి 17 వందల మెగావాట్ల విద్యుత్ అవసరమౌతుంది. ఈ నేపధ్యంలో ముంబాయికు వేయి నుంచి 11 వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఉంటోంది. గ్రిడ్ ఫెయిల్ అయిన కారణంగా ఉదయం 10 గంటల నుండి చర్చ్ గేట్, బోరివిలీ లోకల్ ట్రైన్లను నిలిపివేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వద్ద లోకల్ ట్రైన్లను పూర్తిగా నిలిపివేయడంతో ఉదయం 10 గంటల నుండి ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికనత పనిచేస్తున్నామని టాటా పవర్, అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి తీసుకొస్తామని వెల్లడించాయి.

Tags :
|

Advertisement