Advertisement

రైతుల యూనియన్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది...

By: chandrasekar Sat, 12 Dec 2020 5:02 PM

రైతుల యూనియన్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది...


గత రెండు వారాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. డిమాండ్లపై ఆందోళన చేస్తున్న ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని రైతు నేతలు భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు మద్దతు ధర ఇతర అంశాలపై రైతు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపింది. అయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో అన్ సక్సెస్‌పుల్‌గా మిగిలాయి.

ఈ కారణంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ బిల్లులను చట్టాలు చేశారని తెలిపాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒంటికాలిపై లేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఖండించారు. ప్రభుత్వ యొక్క ఐడియా చూస్తుంటే బీహర్ రైతుల స్థాయికి తీసుకెళ్లతారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం రైతు ప్రతినిధులుతో జరుపుతున్న చర్చలు విఫలమవుతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు.

Tags :

Advertisement