Advertisement

  • పేరు మోసిన ఘరానా దొంగ...10 సెకన్లలో ఎలాంటి ఇంటి తాళం అయిన తీయగలడు...!

పేరు మోసిన ఘరానా దొంగ...10 సెకన్లలో ఎలాంటి ఇంటి తాళం అయిన తీయగలడు...!

By: Anji Sat, 26 Dec 2020 4:27 PM

పేరు మోసిన ఘరానా దొంగ...10 సెకన్లలో ఎలాంటి ఇంటి తాళం అయిన తీయగలడు...!

రాష్ట్రంలో పేరు మోసిన ఘరానా దొంగ శంకర్ ను ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కేసులను ఛేదించి అతని ముఠా నుంచి 12 లక్షల నగదు, అరకిలో వెండి, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శంకర్ తో పాటు ముఠాలోని మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

చిలకలగూడకు చెందిన శంకర్ మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. 19వ ఏటనే తల్లితో గొడవ పడిన వ్యక్తిపై హత్యాయత్నం చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత దొంగలతో పరిచయం పెంచుకుని రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను దోచుకునేవాడు.

33సార్లు జైలుకు వెళ్లొచ్చిన శంకర్ పై 4 సార్లు పీడీ చట్టం ప్రయోగించారు. 60 ఏళ్లున్న శంకర్... 15 ఏళ్లుగా మహారాష్ట్రలోని లాతూర్ నుంచి రైళ్లో వచ్చి చోరీలు చేసి వెళ్లేవాడు.

60 ఏళ్ల వయసులోనూ ముఠాలు ఏర్పాటు చేసి దొంగతనాలు చేస్తున్న శంకర్ పై మరోసారి పీడీ చట్టం ప్రయోగించేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.

250కి పైగా దొంగతనాలు, 209 కేసుల్లో నేర నిరూపణ, 4 సార్లు పీడీ చట్టం, 33సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర శంకర్ ది. 41ఏళ్లుగా దొంగతనాలే పనిగా పెట్టుకున్న శంకర్ కు కేవలం స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్ ఉంటే చాలు 10 సెకన్లలో ఎలాంటి ఇంటి తాళాన్నైనా తీయగలడు.

Tags :

Advertisement