Advertisement

  • అంతరించిపోయే దశలో వున్న అండమాన్ ట్రైబ్స్ ఆదివాసీల జాతి

అంతరించిపోయే దశలో వున్న అండమాన్ ట్రైబ్స్ ఆదివాసీల జాతి

By: chandrasekar Fri, 28 Aug 2020 5:07 PM

అంతరించిపోయే దశలో వున్న అండమాన్ ట్రైబ్స్ ఆదివాసీల జాతి


గ్రేట్ అండమానీస్ ట్రైబ్ ఆదివాసీల జాతికి చెందినవాళ్లు స్ట్రెయిట్ ఐల్యాండ్ అనే చిన్న దీవిలో 60 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాతి అంతరించిపోయే దశలో ఉంది. ప్రస్తుతం ఈ 1971లో వీరు 24 మంది మాత్రమే ఉండగా, 2001 నాటికి వీరి సంఖ్య 43కు, ప్రస్తుతం 60కి పెరిగింది. జనాభా పదుల్లోనే ఉన్నందున ఈ తెగను కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ కేటగిరీలో చేర్చింది. ఒకప్పుడు వేటాడుతూ జీవించే ఈ తెగ ప్రజలు ఇప్పుడు తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు. కొందరు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

అండమాన్ ఆదివాసీలకూ కరోనా..

అండమాన్ నికోబార్ దీవుల్లో మారుమూల దీవిలో నివసించే ఆదివాసీలకూ కరోనా మహమ్మారి అంటుకుంది. గ్రేట్ అండమానీస్ ట్రైబ్ కు చెందిన ఐదుగురికి వైరస్ సోకినట్లు అండమాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అవిజిత్ రాయ్ వెల్లడించారు. వీరికి ఎలాంటి సింప్టమ్స్ లేవని, అందరినీ పోర్ట్ బ్లెయిర్ లోని హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు. అంతరించే దశలో ఉన్నందున ఈ తెగలోని అందరికీ స్పెషల్ టీం వెళ్లి ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేసింది. పది రోజుల పాటు వీరిని అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఎలాంటి సింప్టమ్స్ లేకపోతే తిరిగి వాళ్ల దీవికి పంపిస్తామని అవిజిత్ రాయ్ చెప్పారు. ప్రస్తుతం ఈ దీవిలోకి అధికారులు తప్ప బయటివారెవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :
|

Advertisement