Advertisement

  • గ్రీన్‌చాలెంజ్‌ మూడోవిడతలో పాల్గొన్న దర్శకుడు సంపత్‌నంది

గ్రీన్‌చాలెంజ్‌ మూడోవిడతలో పాల్గొన్న దర్శకుడు సంపత్‌నంది

By: chandrasekar Thu, 16 July 2020 12:46 PM

గ్రీన్‌చాలెంజ్‌ మూడోవిడతలో పాల్గొన్న దర్శకుడు సంపత్‌నంది


కరోనా వైరస్‌ కారణంగా మనమంతా ముఖానికి మాస్కులు ధరించి తిరుగుతున్నాము, భవిష్యత్తులో వీపులకు ఆక్సిజన్‌ సిలిండర్‌ వేసుకొని తిరిగే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు దర్శకుడు సంపత్‌నంది.

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌చాలెంజ్‌ మూడోవిడతలో బుధవారం సంపత్‌నంది భాగమయ్యారు. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ ‘పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటాడని తెలిసి ఆశ్చర్యమేసింది. ఒక మనిషి అన్ని మొక్కలు ఎలా నాటాడనిపించింది. కర్ణాటకకు చెందిన మరో పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క జాతీయ రహదారుల వెంట నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలు నాటారని తెలిసి సంతోషపడ్డా. ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌చాలెంజ్‌ను ప్రారంభించి మూడు కోట్ల మొక్కలను నాటారు. రామయ్య, తిమ్మక్కలకు మించిన గౌరవం సంతోష్‌కుమార్‌గారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

ఈ గ్రీన్‌చాలెంజ్‌కు భూమిక, ఊర్వశి రౌతేలా, దిగాంగనా సూర్యవన్షీలను నామినేట్‌ చేశారు సంపత్‌నంది. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌చాలెంజ్‌లో భాగమయ్యారు నటుడు కృష్ణుడు. ఎంపీ సంతోష్‌కుమార్‌ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన బుధవారం తన నివాసంలో మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గొప్ప కార్యక్రమమిదని కృష్ణుడు తెలిపారు.

జబర్దస్త్‌ టీం గ్రీన్‌చాలెంజ్‌ వృక్షసంపద లేకుండా మానవాళి మనగడ ఉండదని అన్నారు జబర్దస్త్‌ బృందం. జబర్దస్త్‌ నటులు అదిరే అభి, కెవ్వు కార్తిక్‌, రాజమౌళి, నరేష్‌, అప్పారావు, లక్ష్మీ అప్పారావు బుధవారం గ్రీన్‌చాలెంజ్‌లో పాల్గొన్నారు. గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్‌చాలెంజ్‌ను ఒక ఉద్యమంలా ఎంపీ సంతోష్‌కుమార్‌గారు ముందుకు తీసుకుపోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

కాలుష్యాన్ని తగ్గించడం కోసంబుల్లితెర నటుడు కౌశిక్‌శ్రీకృష్ణ బుధవారం గ్రీన్‌చాలెంజ్‌లో భాగమై మొక్కలు నాటారు.మనం నాటే ఒక్కో మొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Tags :

Advertisement