Advertisement

  • ఆస్తుల నమోదుకు వాడే ధ‌ర‌ణి పోర్ట‌ల్ అక్టోబర్ 29న ప్రారంభం

ఆస్తుల నమోదుకు వాడే ధ‌ర‌ణి పోర్ట‌ల్ అక్టోబర్ 29న ప్రారంభం

By: chandrasekar Sat, 24 Oct 2020 09:18 AM

ఆస్తుల నమోదుకు వాడే ధ‌ర‌ణి పోర్ట‌ల్ అక్టోబర్ 29న ప్రారంభం


తెలంగాణాలో ఆస్తుల నమోదు ప్రక్రియ ను క్రమబద్దీకరించడంలో భాగంగా ధరణి పోర్టల్ రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ దసరా నాడు ధరణి పోర్టల్ ప్రారంభిస్తారని ఆ రోజు నుంచి తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని వెల్లడించింది.

అనతి కాలంగా కురిసిన భారీ వర్షాల వల్ల తాజాగా ధరణి పోర్టల్ ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే పోర్టల్ ప్రారంభం వాయిదా పడినట్టు తెలుస్తోంది.

దీనివల్ల ప్రతివొక్కరి భూముల వివరాలు ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేయబడుతుంది. ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలనే అంశంపై తాసిల్దార్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా విజయవంతమైంది.

Tags :
|

Advertisement