Advertisement

భారత సరిహద్దుల్లో చైనా బలగాల నిష్క్రమణ

By: chandrasekar Wed, 10 June 2020 11:28 AM

భారత సరిహద్దుల్లో చైనా బలగాల నిష్క్రమణ


భారతదేశం సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ ప్రాంతం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించింది. నెల రోజులపాటు భారత సైన్యంతో ఉద్రిక్తతలు నెలకొన్న పాంగ్యాంగ్ త్సో సెక్టార్‌ నుంచి కూడా చైనా బలగాలు నిష్క్రమిస్తున్నాయి. సోమవారం నుంచే చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

చైనా వెనక్కి తగ్గడంతో భారత సైనిక బలగాలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ఎదురెదురు నిలిచిన మూడు ప్రాంతాల నుంచి సైనిక బలగాలు వెనక్కి పోగా నాలుగో ప్రాంతంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

the departure,of chinese,forces,on indian,borders ,భారత, సరిహద్దుల్లో, చైనా, బలగాల, నిష్క్రమణ


ఇరు దేశాలకు చెందిన మిలటరీ కమాండర్ల మధ్య చర్చలు జరిగాక స్టాండాఫ్ పాయింట్లు తగ్గాయి. లేహ్‌కు చెందిన 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చైనాలోని సౌత్ జిన్‌జియాంగ్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య చర్యలు జరిగాయి. గాల్వాన్ ఏరియా, పెట్రోలింగ్ ఏరియా 15, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యం మధ్య ఈ వారం చర్చలు జరిగాయి.

Tags :
|

Advertisement