Advertisement

  • ఆరేళ్ల క్రితమే జోస్యం చెప్పిన క్రికెటర్...అతనే ఎన్నికల్లో విజయం సాధించాడు

ఆరేళ్ల క్రితమే జోస్యం చెప్పిన క్రికెటర్...అతనే ఎన్నికల్లో విజయం సాధించాడు

By: chandrasekar Mon, 09 Nov 2020 6:38 PM

ఆరేళ్ల క్రితమే జోస్యం చెప్పిన క్రికెటర్...అతనే ఎన్నికల్లో విజయం సాధించాడు


ఈ మధ్య క్రికెటర్లు జోతిష్యులుగా మారిపోతున్నారు. తాజా ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గతంలో చేసిన ఓ ట్విట్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చంది. అయితే ఈ ట్విట్ క్రికెట్ గురించి మాత్రం కాదు. అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆర్చర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ అవుతాడంటూ ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరేళ్ల క్రితమే జోస్యం చెప్పాడు. తాజాగా అతనే ఎన్నికల్లో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.

ఓటింగ్ లెక్కింపు చివరి వరకు నువ్వ-నేనా అంటూ జరిగిన టఫ్ ఫైట్‌ అందర్ని ఉత్కంఠకు గురిచేసింది. కానీ జోఫ్రా ఆర్చర్ ఎలా ముందే ఊహించాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ట్విట్‌లో ఆర్చర్.. 'జో' అని మాత్రమే ట్వీట్ చేశాడు. ఈ తాజాగా రాజస్థాన్‌ రాయల్స్ రీట్వీట్‌ చేసింది. 2014 అక్టోబర్‌ 4నే అతడు ఈ ట్వీట్‌ చేశాడట. అతను నిజంగానే చేసాడో లేదా యాదృచ్ఛికమో తెలియదు కానీ.. అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. ఈ ట్విట్‌పై అభిమానులు కూడా రకరకాలుగా సెటైర్స్ వేస్తున్నారు. ఆర్చర్‌ వద్ద టైమ్‌ మిషీన్‌ ఉన్నంటు ఉందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కరోనాకు టీకా ఎప్పుడొస్తుందో ఆర్చర్‌ చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు. జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించి ఆర్చర్‌ ఇలా ట్వీట్లు చేస్తుంటాడని అంటుంన్నారు.

అతను చేసిన ట్విట్లు చాలా నిజమయ్యాయి.. యూనివర్సల్ బాస్ క్రిస్ ‌గేల్‌ 99 రన్స్ వద్ద ఔట్ కావడం, 2015లో 'ఏబీ సో స్పెషల్' అంటూ చేసిన ట్విట్స్ ఈ ఐపీఎల్ నిజమయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌పై 22 బంతుల్లో 55 రన్స్ చేసిన ఏబీ ఆ మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే 21 రోజుల లాక్‌డౌన్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్‌ వంటి సంబంధించిన ట్విట్స్ నిజంగా జరిగాయి. ఇది చూసిన అభిమానులు ఆర్ఛర్‌కు కాలజ్ఞానం ఏమైనా తెలుసా అంటూ మిమ్స్ చేస్తున్నారు.

Tags :

Advertisement