Advertisement

  • పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారిదే...

పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారిదే...

By: chandrasekar Wed, 23 Dec 2020 5:00 PM

పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారిదే...


రాజమహేంద్రవరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత‌ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని ఆయన అన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కాకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. గోదావరిపై తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని, దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించలేదని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పార్టీలను కలుపుకుని పార్లమెంట్‌లో ఒత్తిడి తేవాలని కోరారు.

జాతీయ ప్రాజెక్ట్‌ను విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తిగా నిర్మించాల్సి ఉండగా నీతి ఆయోగ్‌ మాత్రం 70 శాతం నిధులను కేంద్రం, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలవరం నిర్మాణానికయ్యే మొత్తం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా రూ.7 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని కేంద్రం ప్రకటించడం అన్యాయమన్నారు. పునరావాసానికి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు.

Tags :

Advertisement