Advertisement

మేక ఖరీదు ఏకంగా రూ.1.5 కోట్లట

By: chandrasekar Mon, 30 Nov 2020 11:21 PM

మేక ఖరీదు ఏకంగా రూ.1.5 కోట్లట


సంతలో అమ్మకానికి వచ్చిన మేక ఖరీదు ఏకంగా రూ.1.5 కోట్లట. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. మేకల ధరలు లక్షలు పలుకుతాయంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎంత జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు పెట్టి పెంచినా కూడా లక్షలు పెట్టి ఎవరు కొంటారు చెప్పండి. అయితే, మీరు ఇప్పుడు చదవబోయే స్టోరీ మిమ్మల్ని కచ్చితంగా షాక్‌కి గురి చేస్తుంది. కరోనా వైరస్ కారణంగా పశువుల సంతలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం కొంచెం సద్దుమణిగినట్టు కనిపించడంతో మళ్లీ మేకల సంతలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని అట్పాడి‌లో ఇలాంటి సంత ఒకటి ఉంది.

ఈ సంత ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ భారీగా జరుగుతుంది. ఈ సంతలో పశువులను కొనడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో అట్పాడిలో ఉన్న సంతకు ఓ యజమానికి కొన్ని మేకలను తీసుకొచ్చాడు. అందులో ఓ మేక జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆ మేక చూడడానికి మామూలువాటిలా ఉండదు మరియు కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అలాగే, మరో ముఖ్యకారణం ఏమంటే దాని పేరు ‘మోదీ.’ సంగోలా తాలూకాలోని చందోల్‌వాడీకి చెందిన బాబూరావు మేట్కారీ ఈ మేకను తీసుకుని వచ్చాడు. ఆ మేకను ఓ వ్యక్తి రూ.70 లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అయ్యాడు.

ఇంత రేటు చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ విషయం తెలిసిన ఇతర వ్యాపారులు అందరూ షాక్‌కి గురయ్యారు. బాబూరావు మేట్కారీ పంట పండిందనుకున్నారు. ఒక్క మేక అతడి లైఫ్‌ను మార్చేసిందని ఆనందించారు. కానీ, వారందరీకి షాక్ ఇచ్చాడు బాబూరావు మేట్కారీ. తన మేకను ఇవ్వాలంటే రూ.1.5 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత ధర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మేక అమ్ముడు పోలేదు. ఖరీదు ఎక్కువగా ఉండడంతో అందరూ భయపడ్డారు. బాబూరావు అయినా కూడా నిరుత్సాహపడకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తాను అడిగిన రేటు వస్తేనే అమ్ముతానని ప్రకటించాడు. మరి దీన్ని కొనడానికి ఎవరు వస్తారో.

Tags :
|
|

Advertisement