Advertisement

  • కరోనా తో మరణించిన కొడుకు శవం రాత్రంతా వానలో తడుస్తూ... ఉదయం తల్లి కూడా మరణం

కరోనా తో మరణించిన కొడుకు శవం రాత్రంతా వానలో తడుస్తూ... ఉదయం తల్లి కూడా మరణం

By: chandrasekar Fri, 14 Aug 2020 6:57 PM

కరోనా తో మరణించిన కొడుకు శవం రాత్రంతా వానలో తడుస్తూ... ఉదయం తల్లి కూడా మరణం


కరోనా తో మరణించిన కొడుకు శవం రాత్రంతా వానలోనే తడుస్తూ ఉంచేశారు మరియు ఉదయానికల్లా తల్లి కూడా కరోనా వల్ల మరణించింది. కరోనా భయంతో కొడుకు చనిపోగా ఆ ఆవేదనను భరించలేక తెల్లారేసరికి తల్లి కూడా చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన సంగతి తెలిసిందే. కేవలం 12 గంటల వ్యవధిలో తల్లీ కొడుకులు చనిపోవడంతో ఆ ఉమ్మడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ కాగా, ఇద్దరు వైరస్ సోకి చనిపోయారు. బుధవారం రాత్రి కుమారుడు (35), ఉదయానికి తల్లి (65) చనిపోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. బుధవారం రాత్రి కుమారుడు సోఫాలో కూర్చొని కుప్పకూలి చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ శవాన్ని సోఫాతో సహా బయట ఉంచేశారు. ఇలా రాత్రంతా కుమారుడి మృత దేహం వానలోనే తడుస్తూ ఉండడం గమనార్హం. గురువారం ఉదయం అతని తల్లి కరోనా వల్ల చనిపోయింది. దీంతో ఈ ఇద్దరి మృతదేహాలను శ్మశానానికి కూడా కుటుంబ సభ్యులు తీసుకెళ్లలేదు.

ఇద్దరు మృతదేహాలను మున్సిపల్ సిబ్బందే తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా భయంతో కనీసం కుటుంబంలో ఒక్కరు కూడా అంత్యక్రియలకు వెళ్లలేదు. ఈ కుటుంబంలో తొలుత పెద్ద కుమారుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులు 12 మంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. యాంటిజెన్ పరీక్షల్లో తొలుత ఆరుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. అయితే, పాజిటివ్, నెగటివ్ వచ్చినవారు ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కుమారుడు బుధవారం రాత్రి సోఫాలో కూర్చొని కుప్పకూలిపోయాడు. నారాయణఖేడ్‌లో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో కరోనా వైరస్ పట్ల మరింత భయాందోళన నెలకొంది. కరోనా మహమ్మారి ఒక కుటుంబాన్ని ఇంతగా కలవర పెట్టి ఇద్దరు ప్రాణాలను తీసింది. తగు జాగ్రత్తలతో వ్యవహరించి ఉంటే ఇంత జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement