Advertisement

  • కరోనా వైరస్ గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదం

కరోనా వైరస్ గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదం

By: chandrasekar Fri, 04 Sept 2020 4:14 PM

కరోనా వైరస్ గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదం


కరోనా వైరస్‌ గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదముందని పరిశోధనలో తేలింది. ఇప్పటి వరకు దాదాపు 9 నెలలు గడుస్తున్నా దీని వ్యాప్తికి సంబంధించిన కారణాలపై పరిశోధకులకు స్పష్టత రావడం లేదు. మొదట్లో గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం లేదన్న పరిశోధకులు ఆ తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్నారు. తాజాగా గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా ఈ వైరస్‌ సోకే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది.జామా (జేఏఎంఏ) ఇంటన్నేషనల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం కరోనా బాధితుడితో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌ లేకపోయినా గాలి ద్వారా వైరస్‌ రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదముంది.

గాలిద్వారా కరోనా సోకడం వల్ల దీని ప్రభావం మరింత ఎక్కువగా వుంది. రోగి నుండి పరిసర ప్రాంతాల్లోని ఇతరులకు సులభంగా వ్యాపిస్తూ వుంది. చైనాలో ఓ కరోనా రోగి ద్వారా 24 మందికి ఈ ఏడాది జనవరిలో ఇదే విధంగా కోవిడ్ సంక్రమించినట్లు తెలిసింది. కోవిడ్-19 రోగి బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో అతడికి రెండు మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా గాలి ద్వారా వైరస్‌ సోకింది. వైరస్‌ తొలినాళ్లలో ఇది జరగడంతో అప్పటికి మాస్క్ తప్పనిసరి నిబంధన అక్కడ లేదు. కాగా, కరోనాపై ఒక్కో అధ్యయనంలో ఒక్కో కొత్త విషయం బయటపడుతూనే ఉంది. తూర్పు చైనాలోని యుద్ధ నౌక కార్యక్రమంలో పాల్గొనేందుకు 128 మంది రెండు బస్సుల్లో వెళ్లారు. ఓ బస్సులో కోవిడ్-19 రోగితో ప్రయాణించిన వారికి వేరే బస్సులో ప్రయాణించిన వారితో పోలిస్తే వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. అందు వల్లే సామాజిక దూరం పాటించినట్లైతే దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

Tags :
|
|

Advertisement