Advertisement

వీరి కారణంగా కరోనా వ్యాక్సిన్ రానుంది

By: chandrasekar Wed, 05 Aug 2020 6:51 PM

వీరి కారణంగా కరోనా వ్యాక్సిన్ రానుంది


కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారుదిశగా పలు దేశాలు విశేషంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పార్శీ కుటుంబం కరోనాకు వ్యాక్సిన్ తేవడంలో విశేషంగా కృషి చేస్తోంది. కోటిశ్వరులైనప్పటికీ ఎలాంటి బేషజాలు లేకుండా సమాజం అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్శి కుటుంబానికి చెందిన 78 ఏండ్ల వయసున్న సైరస్ పూనావాలా ఆయన కుమారుడు 39 ఏండ్ల సియోన్ ఆదార్ పూనావాలా కోటీశ్వరులు. గుర్రాలు, ఫ్యాన్సీ కార్లకు కొదవలేదు. వీరు పలు వ్యాపారాలను నిర్వహించడంతోపాటు ప్రపంచంలోని అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అధిపతులుగా ఉన్నారు.

సమర్థత, భద్రత పరీక్షలు జరుపడానికి ముందే వందల కోట్ల కరోనా వ్యాక్సిన్ మోతాదులను తయారుచేయాలని ధైర్యంగా ముందుకొచ్చారు. పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయేందుకు కూడా ఇష్టపడి ముందుకు రావడం వీరి గొప్పతనంగా మనం భావించాలి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలు పూర్తయి జంతువులు, మనుషులపై ట్రయల్స్ చేసి ఫలితాలు వచ్చిన తర్వాత వందల కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లను ప్రజలకు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 300 నుంచి 400 మిలియన్ మోతాదులను తయారు చేయాలని తమ కంపెనీ యోచిస్తోందని, ఇది భారత్ తోపాటు ఇతర మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు బిలియన్ మోతాదులను అందిస్తామని అదార్ పూనవాల్లా గత నెలలో చెప్పారు. "టీకా పరీక్షలు పూర్తయిన తర్వాత, విజయవంతం అయిన తర్వాత, దీనిని ప్రభుత్వాలు సేకరించి పంపిణీ చేస్తాయి. తద్వారా ప్రజలు నేరుగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు" అని ఎస్ఐఐ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

సైరస్ పూనావాలా 1960 వ దశకంలో పుణెలోని తన సొంత గుర్రాల ఫామ్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గుర్రాల పెంపకం చేసేవాడు. అతని గుర్రాలకు సీరం అవసరమయ్యే టీకాలు కావాల్సివస్తుండేది. ఇక్కడి నుంచే సీరం పరిశోధనశాల ఏర్పాటు ఆలోచనకు బీజం పడింది. 1966 లో 12,000 డాలర్ల మూలధనంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వ్యాక్సిన్లను దేశానికి అందించారు. ఈ రోజు ఫోర్బ్స్ సంపన్న


సైరస్ పూనావాలా 1960 వ దశకంలో పుణెలోని తన సొంత గుర్రాల ఫామ్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గుర్రాల పెంపకం చేసేవాడు. అతని గుర్రాలకు సీరం అవసరమయ్యే టీకాలు కావాల్సివస్తుండేది. ఇక్కడి నుంచే సీరం పరిశోధనశాల ఏర్పాటు ఆలోచనకు బీజం పడింది. 1966 లో 12,000 డాలర్ల మూలధనంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వ్యాక్సిన్లను దేశానికి అందించారు. ఈ రోజు ఫోర్బ్స్ సంపన్న ప్రపంచ జాబితాలో 165 వ స్థానంలో, భారతీయుల జాబితాలో సైరస్ 12 వ స్థానంలో ఉన్నారు. వీరి నికర విలువ దాదాపు 12 బిలియన్ డాలర్లు. ఈయన స్థాపించిన కంపెనీ మీజిల్స్, పోలియో వంటి వ్యాధుల కోసం 1.5 బిలియన్ మోతాదుల టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. మంచి జీవితాన్ని గడపడంతోపాటు పూనవాల్లాస్ దాతృత్వం, కళల పోషకులు కూడా. సైరస్ ఇటీవల బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్, హోనోరిస్ కాసా’ పొందారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ తో గౌరవించింది.

Tags :

Advertisement