Advertisement

  • ప‌్ర‌పంచ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న‌ది: టెడ్రోస్

ప‌్ర‌పంచ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న‌ది: టెడ్రోస్

By: chandrasekar Tue, 23 June 2020 3:34 PM

ప‌్ర‌పంచ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న‌ది: టెడ్రోస్


ప‌్ర‌పంచ దేశాల్లో కరోనా ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉన్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నామ్ గాబ్రియోస్‌ తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత‌ కొన్ని దేశాల్లో క‌రోనా వేగంగా విస్తరిస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల‌ను ఇంకా వణికిస్తూనే ఉంది. అయినప్పటికీ అన్ని దేశాలు ఆర్థిక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయడమే కాకుండా వార్షిక మ్యూజికల్ ఫెస్టివల్‌ను సైతం నిర్వహించారు.

అంతేకాకుండా లక్షలాది మంది పిల్లలు తిరిగి స్కూళ్లకు కూడా వెళ్తున్నారు. మరోపక్క బ్రెజిల్‌ ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయినప్పటికి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వైరస్‌ను చిన్న ఫ్లూతో పోల్చుతున్నారు.

ఆర్థిక ప్రభావం వైరస్ కంటే ప్రమాదకరంగా ఉంటుందంటూ వాదిస్తున్నారు. అందుకే లాక్‌డౌన్‌ విధించడంపై ఆయన విముఖత చూపుతూ వస్తున్నారు. కరోనా వైరస్ ఆరోగ్య సంక్షోభం కంటే ప్రమాదకరమైనదని తనకు తెలుసని టెడ్రోస్ అన్నారు. అయితే కరోనాను ప్రపంచదేశాలన్ని ఐక్యమత్యంగా ఎదుర్కోవాల‌ని, ఇలా దేశాలుగా ఎవ‌రికివారు విడిపోయి మ‌హ‌మ్మారిని జయించలేర‌ని టెడ్రోస్ అభిప్రాయం.

Tags :

Advertisement