Advertisement

  • కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలతో కరోనా వ్యాపించదు: డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి

కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలతో కరోనా వ్యాపించదు: డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి

By: chandrasekar Mon, 03 Aug 2020 5:09 PM

కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలతో కరోనా వ్యాపించదు: డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి


అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి కరోనా కారణంగా మరణించినవారి భౌతికదేహం నుంచి వైరస్‌ వ్యాపించదని చెప్పారు. కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియలను అడ్డుకోవడం సంస్కారంకాదని, అది సామాజిక కళంకమని వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలను పలు గ్రామాల్లో రానీయకుండా అడ్డుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఆయన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు లేఖ రాశారు. వైరస్‌ సోకినవారి దగ్గు, తుమ్ములు లేదా వారు మాట్లాడినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారానే వ్యాధి ఇతరులకు విస్తరిస్తుందని విజయ్‌ స్పష్టంచేశారు.

మృతదేహాలకు ఇటువంటి అవకాశం లేదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, ప్రజలు మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. ఆదివారం ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను విజయ్‌ ఎల్దండి కలిసి ఈ విషయంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించి గౌరవాన్ని ఇవ్వాల్సిన కనీస బాధ్యతలను మరువకూడదు అని ఆయన అన్నారు.

Tags :

Advertisement